‘నాథూరాం గాడ్సే’పై నాగబాబు వివాదాస్పద ట్వీట్.. ఓయూ పోలీస్ ‌స్టేషన్‌లో కేసు!?

1:16 am, Thu, 21 May 20
complaint-registered-against-konidela-nagababu-over-comments-about-nathuram-godse

హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీని కించపరిచారంటూ సినీ నటుడు, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబుపై బుధవారం ఓయూ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 

ఈ మేరకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ఓయూ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. 

చదవండి: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే.. 3 లక్షల ట్వీట్లు.. తారక్ భావోద్వేగం…

అనంతరం మానవతారాయ్ మాట్లాడుతూ.. నాగబాబుకు మతి భ్రమించిందని, ఆయన్ని ఎర్రగడ్డలోని పిచ్చాసుపత్రికి తరలించాలని డిమాండ్ చేశారు. 

మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లనే నాగబాబు గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేని దేశభక్తుడని కొనియాడుతూ ట్వీట్ చేశారని విమర్శించారు.

నాగబాబుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మానవతారాయ్ డిమాండ్ చేశారు. 

complaint-letter-against-nagababu

అసలేం జరిగిందంటే…

మంగళవారం నాథూరాం గాడ్సే జన్మదినం సందర్భంగా నాగబాబు ట్వీట్‌ చేశారు.

‘ఈరోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశభక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది డిబేటబుల్‌. అతని వైపు వాదనని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు అంతే). గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఓసారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్‌ సోల్‌ రెస్ట్‌ ఇన్‌ పీస్..‌’ అంటూ నాగబాబు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.  

తన ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో ఆ తరువాత నాగబాబు వివరణ ఇచ్చారు. నాథూరాం గాడ్సే నేరాన్ని సమర్థించడం తన ఉద్దేశం కాదని, గాంధీ అంటే తనకు చాలా గౌరవం అని పేర్కొన్నారు. మరి ఓయూ పోలీసులు మానవతారాయ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.