విడాకులు తీసుకోనున్న డైరెక్టర్ క్రిష్! ఓ నటితో డేటింగే కారణమా?

- Advertisement -

టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి వైవాహిక జీవితం ఒడిదొడుకుల్లో ఉన్నట్లు సమాచారం.  క్రిష్, ఆయన భార్య రమ్య ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోనున్నారట. ఇప్పటికే వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని సమాచారం.

డాక్టర్ రమ్య వెలగను క్రిష్ 2016 ఆగష్టు 7న వివాహం చేసుకున్నారు. నా సినీ జీవితం ‘గమ్యం’తో మొదలైతే, నా అసలు జీవితం ఇప్పుడు ‘రమ్యం’గా మొదలవుతోంది. మీ ఆశీస్సులు కావాలంటూ క్రిష్‌ వైవిధ్యమైన శుభలేఖతో బంధు మిత్రులను తన వివాహానికి ఆహ్వానించారు. అలాంటి క్రిష్ ఇప్పుడు విడాకులకు దరఖాస్తు చేశారంటే కారణం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

మరోవైపు డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కంగనా రనౌత్‌ హీరోయిన్‌గా ఆయన తెరకెక్కించిన ‘మణికర్ణిక’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయ్యాక ‘ఎన్టీఆర్’ బయోపిక్ బాధ్యతలను కూడా స్వీకరించనున్నాడు. ఇవి రెండూ భారీ అంచనాలున్న ప్రాజెక్టులే. ఓవైపు వృత్తిపరంగా దూసుకెళ్తున్నప్పటికీ.. క్రిష్‌కు వైవాహిక జీవితంలో మాత్రం ఒడిదొడుకులు తప్పలేదు.

అసలు క్రిష్ విడాకులకు దరఖాస్తు చేయడానికి.. అతడు ఓ నటితో డేటింగ్ చేయడమే కారణమనే పుకారు టాలీవుడ్‌లో షికారు చేస్తోంది.  అంతేకాదు, క్రిష్ డైరెక్షన్‌లోనే ఆ హీరోయిన్ ఓ హిట్ చిత్రంలో నటించిందని, క్రిష్ పెళ్లయ్యాక కూడా వీరి అనుబంధం కొనసాగుతోందని, అందుకే రమ్య తన భర్త క్రిష్ నుంచి విడాకులు తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.
- Advertisement -