అనకాపల్లిలో పెట్టినా, చెన్నైలో పెట్టినా ఒకటే: ఏపీ రాజధానిపై రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్…

11:08 am, Sat, 28 December 19

అమరావతి: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఏపీ రాజధాని వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించాడు. ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు.

జగన్ రాజధాని గేమ్ ఆడుతున్నారని అన్నాడు. తన దృష్టిలో రాజధాని అనే పదానికి అర్ధమే లేదని, రాజకీయాలతో సంబంధం లేని సామాన్యులకు రాజధానితో పని ఏముంటుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని ఎక్కడ ఉన్నా ఒక్కటేనని అన్నాడు. రాజధానిని పక్క రాష్ట్రంలో పెట్టినా పట్టించుకోనని పేర్కొన్నాడు. అనకాపల్లిలో పెట్టినా చెన్నైలో పెట్టినా ఒకటేనన్నాడు.

రాజధాని అంటే మెయిన్ థియేటర్‌తో పోల్చిన వర్మ.. ప్రజలకు నేరుగా పాలన అందాలంటే ప్రతి పట్టణానికి ఒక రాజధాని ఉండాలని పేర్కొన్నాడు.