మరో సినిమా ప్రకటించేసిన రాంగోపాల్ వర్మ.. ఈసారి ‘12 O’ CLOCK’తో వచ్చేస్తున్నవివాదాస్పద దర్శకుడు

Lakshmi's NTR Latest News, RGV Latest News, Tollywood News, NewsxpressonlineLakshmi's NTR Latest News, RGV Latest News, Tollywood News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ లాక్‌డౌన్‌లోనూ ఏమాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. తీసిన సినిమాలను ‘పే ఫర్ వ్యూ’ విధానంలో విడుదల చేస్తున్నాడు.  ఇప్పటికే ఆయన ‘క్లైమాక్స్’, ‘నేకేడ్’ చిత్రాలను ఈ లాక్ డౌన్ సమయంలోనే నిర్మించి విడుదల కూడా చేసేశాడు.

తాజాగా వర్మ మరో సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు. దీని పేరు ’12 ఓ క్లాక్’ (12 O’ CLOCK). ఇది తన నుంచి వస్తున్న మరో హారర్ చిత్రమని వర్మ ఈ సందర్భంగా ప్రకటించాడు.

- Advertisement -

ఇదేమీ లఘు చిత్రం కాదని, 1:45 గంటల నిడివితో సాగుతుందని పేర్కొన్నాడు. ఈ రాత్రి ఏడు గంటలకు దీని ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్టు చెప్పాడు. వర్మ గతంలో ‘రాత్’, ‘భూత్’ వంటి హారర్ చిత్రాలను రూపొందించి ప్రేక్షకులను భయపెట్టాడు.

- Advertisement -