బాలయ్యతో గొడవలు లేవు….కానీ ఆ కారణంతోనే ఎన్టీఆర్ నుంచి తప్పుకున్న: డైరెక్టర్ తేజ

10:54 am, Mon, 13 May 19

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ ఎన్టీఆర్’ బయోపిక్ రెండు భాగాలు ఆశించిన మేర విజయం సాధించని  విషయం తెల్సిందే. కథానాయకుడు, మహానాయకుడు గా వచ్చిన ఈ బయోపిక్ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

అయితే ఈ సినిమా మొదట దర్శకుడు తేజ ఆధ్వర్యంలోనే షూటింగ్ ప్రారంభమైంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో క్రిష్ దర్శకత్వం వహించారు. బాలయ్యతో ఉన్న విభేదాలు కారణంగానే తేజ తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి.

చదవండి: బాలకృష్ణ సినిమాలో విలన్ గా స్టార్ హీరోయిన్!

ఎన్టీఆర్‌కి న్యాయం చేయలేనని అనుకున్న…

ఇక ఈ వార్తలుపై దర్శకుడు తేజ క్లారిటీ ఇచ్చారు. ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ…ఎన్టీఆర్ తనకు అభిమాన నటుడని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని, అయితే ఎన్టీఆర్ చరిత్ర లోతుల్లోకి వెళ్లిన తరువాత, తానైతే ఆయనకు న్యాయం చేయలేనని అనిపించిందని చెప్పారు.

అందువల్లే దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నానని, అంతేగానీ బాలకృష్ణతో గొడవలేమీ రాలేదని అన్నారు. తాను ఏ అభిప్రాయాన్ని అయినా నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్టు చెబుతానని…అందుకే ఎందుకొచ్చిన గోలని ఎన్టీఆర్ బయోపిక్ చూడలేదని స్పష్టం చేశారు.

అయితే ఆ సినిమా తాను చేసుంటే ఇంకా బాగా వచ్చుండేదన్న కామెంట్లు వచ్చాయని, కానీ క్రిష్ లేదా బాలకృష్ణను తగ్గించి చెప్పాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.

చదవండిరామ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన పూరి !