దాసరి నారాయణరావు కుటుంబంలో మరో చిచ్చు! కొడుకులిద్దరి నడుమ ఆస్తి తగాదాలు?

- Advertisement -

హైదరాబాద్: దివంగత దాసరి నారాయణరావు కుటుంబంలో ఆస్తి వివాదం రాజుకుంది. ఆయన ఇద్దరు కుమారుల మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి.

దాసరి చిన్న కొడుకు అరుణ్‌పై పెద్ద కుమారుడు ప్రభు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనెల 24న రాత్రి 10 గంటల సమయంలో అరుణ్ కుమార్ తన ఇంట్లోకి చొరబడి దాడి చేసినట్టు ఆరోపించారు.

- Advertisement -
చదవండి: కరెంట్ బిల్లు చూసి షాక్ అయిన హీరోయిన్! ఎంతొచ్చిందో తెలుసా?

తాగిన మైకంలో దుర్భాషలాడుతూ తమపై చేయి చేసుకున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రభు పేర్కొన్నాడు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి తండ్రి బీరువా తెరిచేందుకు ప్రయత్నించాడని, అడ్డుకున్న తమపై దాడికి దిగాడని ఆరోపించాడు.

అరుణ్ కుమార్, అతడి కారు డ్రైవర్ కలిసి గేటు దూకి లోపలికి ప్రవేశించారని, మరికొంతమంది గేటు బయటే ఉన్నారని, ఆస్తి కోసం అరుణ్ కుమార్ తనను వేధిస్తున్నాడని ఆ ఫిర్యాదులో ఆరోపించారు.

అరుణ్ వెనుక ఉన్న కొందరు పెద్ద మనుషులే తమపై ఇలా దాడులకు ప్రేరేపిస్తున్నారంటూ ప్రభు పలువురిపై అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.

తమ తండ్రి తన ఇంటిని మనవరాలి పేరుపై రాశారని పేర్కొన్న ప్రభు.. తండ్రి రాసిన వీలునామా ప్రకారం ఇల్లు తన కూతురికే చెందుతుందని అన్నారు.

చదవండి: ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో.. అవి కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కావు: కంగనా రౌనత్

తమ కుటుంబంలో రాజుకున్న ఆస్తితగదాల విషయంలో మురళీ మోహన్, మోహన్ బాబు తదితరులను కలిసి వివరించినట్టు చెప్పారు.

ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికైనా ముందుకొచ్చి తమకు న్యాయం చేయాలని ప్రభు కోరారు. ఇద్దరినీ కూర్చోబెట్టి ఆస్తి పంపకాలు జరిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -