ఒకేరోజు ముగ్గురు స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్! ఎవరో తెలుసా?

5:24 pm, Tue, 7 May 19
Pooja Hegde Latest News, Tollywood Latest News, Telugu Movie News, Newsxpressonline

హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్‌ని పూజా హెగ్డే ఒక ఊపు ఊపేస్తోంది. టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరూ పూజాతో కలిసి నటించేందుకు ఎక్కువగా ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. పూజా కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క బిగ్‌ హిట్ లేకపోయినా ఇమేజ్‌ మాత్రం టాలీవుడ్‌లో తార స్థాయికి చేరింది అని చెప్పవచ్చు.

ఇకపోతే పూజా, ఎన్టీఆర్‌ సరనస హీరోయిన్‌గా నటించిన ‘అరవింద సమేత’ ఇప్పటికే రిలీజ్‌ కాగా, సూపర్ స్టార్ మహేష్‌ సరసన నటించిన ‘మహర్షి’ చిత్రం ఈ నెల 9న రిలీజ్‌ కానుంది. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు జోడిగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్‌ మీద ఉంది.

స్వయంగా వెల్లడించిన పూజా హెగ్డే…

తాజాగా ‘మహర్షి’ ప్రమోషన్‌ సందర్భంగా టాప్‌ స్టార్స్‌తో కలిసి నటించటంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు పూజా హెగ్డే… అరవింద సమేత, మహర్షి, ప్రభాస్‌ సినిమాలు ఒకేసారి షూటింగ్ జరగటంతో పూజా.. ఒకే రోజు ముగ్గురు హీరోలతో కలిసి నటించాల్సి వచ్చింది అని తెలిపింది.

ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు ఎన్టీఆర్‌తో అరవింద సమేత, మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు మహేష్‌ బాబు మహర్షి, రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకు ప్రభాస్‌ సినిమాల షూటింగ్‌లో పాల్గొన్నారట.

ఈ షెడ్యూల్స్‌ సమయంలో రోజుకు కేవలం నాలుగు గంటల మాత్రమే నిద్రపోయేందుకు సమయం దొరికేది అని తెలిపింది. కొంచెం కష్టమనిపించినా ఒకేసారి ముగ్గురు టాప్‌ హీరోలతో కలిసి నటించటం ఆనందంగా ఉంది అని చెప్పింది పూజ.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే హీరోయిన్లు గా నటించిన మహర్షి ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లరి నరేష్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. ఈ మూవీ మహేష్‌ 25వ సినిమా కావటంతో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

చదవండి:  పవన్ కల్యాణ్ పాటకు మైమరచి పోయిన జెన్నిఫర్ లోపెజ్! పైకి లేచి మరీ చప్పట్లు…