ఇదే కదా నీ కథ…మనసుకు హత్తుకుంటున్న మహర్షి సాంగ్ !

11:16 am, Sat, 4 May 19
Mahesh Babu Latest News, Maharshi Latest Updates, Tollywood Movie News, Newsxpressonline

హైదరాబాద్: మహేశ్‌బాబు 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘మహర్షి’పై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. ‘భరత్ అనే నేను’ బ్లాక్‌బస్టర్ తర్వాత మహేశ్ నుంచి వస్తున్న సినిమా కావడం, విలక్షణ చిత్రాల డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించడం, స్లిమ్ బ్యూటీ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటించడంతో ఈ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమాస్ బ్యానర్లలో దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు ఈ చిత్రాన్ని భారీ బడ్జెత్‌లో నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘మహర్షి’ ఈ నెల 9న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా పాటల్ని యూనిట్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ హైప్ తీసుకొస్తోంది.

చదవండి:  కట్స్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకున్న మహర్షి……

ఇప్పటికే ‘ఛోటీ ఛోటీ బాతే’, ‘ఎవరెస్ట్ అంచున’, ‘నువ్వే సమస్తం’, ‘పాలా పిట్ట’, ‘పదరా.. పదరా’, ‘ఫిర్ సే’ లిరిక్ సాంగ్స్‌ను యూట్యూట్‌లో విడుదల చేసిన యూనిట్ తాజాగా ‘ఇదే కదా నీ కథ’ అంటూ సాగే మరో పాట విడుదల చేసింది. దీనికి ‘ద సోల్ ఆప్ రిషి’ అంటూ ట్యాగ్‌లైన్ తగిలించింది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను విజయ్ ప్రకాష్ ఆలపించారు.

‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇటీవలే హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్‌ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. కేవలం మూడు రోజుల్లో 9.5మిలియన్ల వ్యూస్ సాధించింది.