‘గుడ్ లక్ సఖి’ టీజర్ రిలీజ్.. నో డౌట్.. కీర్తి సురేష్ మరోసారి అదరగొట్టడం ఖాయం!

keerthy-suresh-in-good-luck-sakhi
- Advertisement -

హైదరాబాద్: ‘మహానటి’తో అందరి హృదయాలను కొల్లగొట్టిన కీర్తి సురేష్ మరోసారి అదరగొట్టేందుకు సిద్ధమైంది. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో కీర్తి ‘గుడ్ లక్ సఖి’ చిత్రంలో నటిస్తోంది. 

ఇందులో కీర్తి సురేష్‌తోపాటు ఆది పినిశెట్టి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. శనివారం సాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. 

- Advertisement -

ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ది ఒక విభిన్నమైన పాత్ర. అదృష్టం లేని ఓ పల్లెటూరి అమ్మాయి ఏకంగా రైఫిల్ షూటింగ్‌లో ఉన్నత శిఖరాలకు ఎలా చేరుకుంది అనేది ఈ సినిమా స్టోరీ. 

ఈ చిత్రంలో నటుడు జగపతి బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో సుధీర్, శ్రావ్య వర్మ నిర్మిస్తున్నారు. 

‘మన రాతను మనమే రాసుకోవాలా’ అంటూ అమాయకంగా కీర్తి సురేష్ పలికే డైలాగ్ అందరి హృదయాలను తాకుతుంది. మొత్తం మీద ఈ సినిమాలో కీర్తి సురేష్ అద్భుత అభినయాన్ని మళ్లీ ఒకసారి అందరం చూడొచ్చన్నమాట. 

 

- Advertisement -