మహేష్‌కు మళ్ళీ షాకిచ్చిన జీఎస్టీ అధికారులు! తాజాగా ‘ఏఎంబీ సినిమాస్‌’కు నోటీసులు…

Mahesh-Babu-Mall
- Advertisement -

maheshbabu

హైదరాబాద్: తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్ 2న గచ్చిబౌలిలో మహేష్ బాబు తన ఏఎంబీ సినిమాస్ మల్టిఫ్లెక్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తక్కువ సమయంలోనే ఏఎంబీ సినిమాస్ కు పాపులారిటీ పెరిగింది.

వరుసగా టాలీవుడ్ సెలెబ్రిటీలు ఏఎంబీ సినిమాస్ ని విజిట్ చేసి అందులోనే అత్యాధునిక సౌకర్యాలకు ఆశ్చర్యపోయారు. తాజాగా ఏఎంబీ సినిమాస్ ఒక వివాదంలో చిక్కుకుంది. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఈ మల్టిప్లెక్స్ లాంచ్ అయిన తర్వాత బాగా పాపులర్ అయింది. ప్రేక్షకుల సందడి పెరిగింది. ఈ మల్టిప్లెక్స్ కి వెళ్లాలనుంటే చేతులో డబ్బు కూడా బాగానే ఉండాలి.

రేటు ఎక్కువ కావడమే కారణం..

కొన్ని రోజుల క్రితం మహేష్ బాబుకు టాక్స్ విషయంలో జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే జీఎస్టీ అధికారులు ఏఎంబీ సినిమాస్ కు నోటీసులు జారీ చేశారు. నిబంధనల్ని అతిక్రమించిన నేపథ్యంలో ఏఎంబీ సినిమాస్ కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం సినిమా టికెట్స్ విషయంలో 28 శాతంగా ఉన్న జిఎస్టీని 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్లు జనవరి 1 నుంచి అమలయ్యాయి. కానీ ఏఎంబీ సినిమాస్ మాత్రం పాత నిబంధనలతోనే ప్రేక్షకులకు అధిక ధరకు టికెట్ విక్రయిస్తున్నట్లు తెలిసిందే. దీంతో విచారణ కోసం జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగారు.

రంగారెడ్డి జిల్లా జీఎస్టీ కమిషనరేట్ యాంటీ ప్రాఫిటీరింగ్ అధికారులు ఏఎంబీ సినిమాస్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

- Advertisement -