హీరోయిన్ నమిత షాకింగ్ లుక్.. సంబరంలో ఫ్యాన్స్…

3:03 pm, Mon, 4 November 19
kollywood-heroine-namitha

హైదరాబాద్: హీరోయిన్ నమిత గుర్తుంది కదా? ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో కోలీవుడ్‌లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నమిత హాట్ హాట్ అందాలు చూడడానికి కుర్రకారు మొదలుకొని వయసు మీదపడిన వారు కూడా పోటీ పడేవారు.

తన అభిమానులతో ఏకంగా గుడి కట్టించుకున్న హీరోయిన్ నమిత అంటే సౌత్‌లో ఎలాంటి క్రేజ్ ఉండేదో అందరికి తెలిసిందే. నమిత అంటే ఇప్పటికి కోలీవుడ్‌లో అదే క్రేజ్ ఉంది. ఇటు టాలీవుడ్‌లోనూ నమితకు ఫాలోయింగ్ ఎక్కువే. సోలో హీరోయిన్‌గా పలు సినిమాలు చేసిన ఈ అమ్మడు ఆ మధ్య వివాహం కూడా చేసుకుని అభిమానులకు దూరమైపోయింది.

కారణం ఏమిటంటే…

దీనికి కారణం నమిత విపరీతంగా లావు అవడమే. ఒకప్పుడు ముద్దుగుమ్మలా ఉండే నమిత రానురాను బొద్దుగుమ్మగా మారిపోయింది. దీంతో సినిమాలలో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. మళ్లీ అలనాటి నమితను చూడలేమా అని ఆమె అభిమానులు డీలా పడిపోయారు. 

అయితే నమిత తాజా లుక్స్ చూస్తే అందరూ షాక్ తినకమానరు. అవును, నమిత తన బొద్దుగుమ్మ ఇమేజ్‌కి పుల్‌స్టాప్ పెట్టేసింది.. చాలా కష్టపడి మళ్లీ ముద్దుగుమ్మగా మారిపోయింది. దీంతో నమిత తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ ఫొటోలు చూసి ఆమె అభిమానులే షాక్ తింటున్నారు. బాబోయ్.. మన నమితేనా? ఇలా మారిపోయిందేమిటి అని ఆశ్చర్యపోయినా ఆనక యమ సంబరపడిపోతున్నారు.  అవును, చాలా కష్టపడి ఎవరు ఊహించని విధంగా నమిత స్లిమ్‌గా మారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నమిత ఫొటోలు చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నమిత సన్నగా.. ఎంత గ్లామరస్‌గా ఉండేదో, ఇప్పుడు అచ్చంగా ఆలాగే మారింది. గత ఏడాది పెళ్లి చేసుకున్న నమిత ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి నటించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. మరి నమితను సరికొత్త లుక్‌లో చూసిన దర్శక నిర్మాతలు మళ్లీ ఈ ముద్దుగుమ్మకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం ఖాయం అని చెప్పుకుంటున్నారు.

heroine-namitha