కరోనా లాక్‌డౌన్: పేదలను ఆదుకునేందుకు.. ఈ హీరోయిన్లు ఏం చేస్తున్నారో చూడండి!

12:44 pm, Sat, 16 May 20

హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్‌ వల్ల దేశంలో ఎంతో మంది నిరుపేదలు తినడానికి తిండి కూడా లేక నానా అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో పేద కుటుంబాల కోసం సినీ రంగ సెలబ్రిటీలు తమకు తోచిన సాయం చేస్తున్నారు.

పలువురు హీరో హీరోయిన్లు ఇప్పటికే ఎన్నో విరాళాలు ప్రకటించారు. ఈ జాబితాలో తాజాగా హీరోయన్ నిత్యా మీనన్ కూడా చేరారు. పేదల కోసం ఆమె తన డ్రస్‌ను వేలం వేస్తున్నట్టు ప్రకటించారు.

లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో నేను ధరించిన డ్రస్‌ను వేలం వేస్తున్నా.. ఈ డ్రెస్‌ను నా స్నేహితురాలు, డిజైనర్ కావేరి నా కోసమే డిజైన్ చేశారు..  దీని వేలం ద్వారా వచ్చిన డబ్బులను అర్పణం ట్రస్ట్‌కి ఇస్తాను అని నిత్యా మీనన్ తెలిపారు.

అర్పణం ట్రస్ట్‌ గ్రామాల్లో పేద ప్రజలకు తమ కాళ్ల మీద తాము నిలబడడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని, సహకారాన్ని అందిస్తుందని ఆమె‌ పేర్కొన్నారు.

అంతేకాదు, ఈ వేలం పాటకు సంబంధించిన వివరాలను నిత్యా మీనన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు.  మే 16న (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు @indiawasted అనే సైట్‌లో ఈ వేలం జరుగుతుందని తెలిపారు.

ఆసక్తి గలవారు ఎవరైనా ఈ వేలం పాటలో పాల్గొని తన డ్రెస్‌ను సొంతం చేసుకోవచ్చని, అత్యధిక ధర చెల్లించిన వారికే అది దక్కుతుందని ఆమె వివరించారు.

ఈ సందర్భంగా లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో తాను ధరించిన డ్రెస్సుకు సంబంధించిన వీడియోను కూడా ఆమె షేర్ చేశారు.

 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

 

@nithyamenen brought life to @bykaveri show at #lakmefashionweek Reposted from @6degreeplatform

A post shared by Nithya Menen (@nithyamenen) on

హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా…

మరోవైపు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా కరోనా లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు పడుతున్న కష్టాల గురించి విని చలించిపోయింది. వారికి ఇతోధికంగా సాయం చేయాలని భావించింది. 

ఈ నేపథ్యంలో సోనాక్షి సిన్హా తాను స్వయంగా గీసిన పెయింటింగ్స్‌ను వేలం వేస్తున్నట్లు ఇటీవలే సోషల్ మీడియాలో ప్రకటించింది. తద్వారా వచ్చిన డబ్బులను వలస కార్మికుల కోసం ఖర్చు చేయనున్నట్లు పేర్కొంది.

తన పెయింటింగ్స్ వేలం ద్వారా వచ్చిన డబ్బుతో వలస కార్మికులకు రేషన్ అందిస్తానని సోనాక్షి వివరించింది.