షాకింగ్! నటుడు విశాల్‌, ఆయన తండ్రికి కరోనా.. నిర్ధారించిన తుప్పరివలన్ స్టార్

- Advertisement -

చెన్నై:  ప్రముఖ తమిళ నటుడు, తుప్పరివలన్ స్టార్ విశాల్‌, ఆయన తండ్రికి కరోనా సోకింది. తొలుత తన తండ్రికి పాజిటివ్‌ రాగా ఆయనకు సహకరిస్తున్న తరుణంలో జ్వరం, జలుబు, దగ్గు తదితర పాజిటివ్ లక్షణాలు కనిపించాయని విశాల్ తెలిపాడు.

ఆ తర్వాత తనకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పరీక్షల్లో తేలిందన్నాడు. విశాల్ మేనేజర్‌కు కూడా కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని విశాల్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు.

- Advertisement -

తామంతా ఆయుర్వేదం మందులు వాడుతున్నామని, ఓ వారంలో కోలుకుంటామని విశాల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 

సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. హిందీ చిత్ర పరిశ్రమలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యరాయ్ తదితరులు ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడ్డారు.

ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నటి, ఎంపీ సుమలత కూడా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. 

- Advertisement -