మా ప్రోత్సాహం ఎల్లప్పుడూ మీకే: జనసేనకు అల్లు అర్జున్ మద్దతు, అధికారిక లేఖ విడుదల…

9:39 pm, Fri, 5 April 19
allu arjun not release on janasena

హైదరాబాద్: టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ జనసేనకు మద్దతు పలుకుతూ అధికారిక లేఖను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్, నాగబాబు రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మా మద్దతు ఎప్పుడు మీకే అంటూ ఎన్నికల ప్రచారంలో మేము లేకపోయినా, సమాజ అభివృద్ధికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.

ఈ విధంగా అల్లు అర్జున్‌ తన మామయ్యలు పవన్‌ కల్యాణ్‌, నాగబాబుకు మద్దతు తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి, విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి కూడా పవన్‌ పోటీ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. అలాగే జనసేన నుండి నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాగబాబు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇకపోతే ప్రస్తుతం ఏపీలో రాజకీయంగా చాలా కీలక దశ నడుస్తుంది. ఎన్నికలకి మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. అలాగే పార్టీల అధినేతలు , అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఈ నెల 9 నే పూర్తీ చేయాల్సి ఉంటుంది.అలాగే 11 న ఏపీలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తన మామయ్యలకి మద్దతు తెలుపుతూ అల్లు అర్జున్‌ ప్రకటన విడుదల చేశారు.

మా ప్రోత్సాహం మీకెప్పుడూ ఉంటాయి అని తెలిపాడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలని ఎంచుకున్న నాగబాబుకు శుభాకాంక్షలు. ఈ రాజకీయ ప్రయాణంలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నా, రానున్న ఎన్నికల ప్రచారంలో మేం మీతో లేకపోయినా, మీకు, సమాజ అభివృద్ధికి మా పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.

అలాగే పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ .. రాజకీయాల్లో విజయవంతంగా రాణిస్తున్న పవన్‌ కల్యాణ్‌, జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న వారందరికీ నా అభినందనలు. పవన్‌ కల్యాణ్‌ తన న్యాయకత్వం తో , అద్భుతమైన విజన్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తారని ఆశిస్తున్నా అని బన్నీ ఒక లేఖ ద్వారా తెలియజేసాడు.దీనిని బట్టి చూస్తే అల్లు అర్జున్ జనసేన తరఫున ప్రచారానికి రావడంలేదు అని అర్థమవుతుంది.

allu arjun not release on janasena