దిల్‌రాజు ఆఫీస్ పై ఐటీ దాడులు! ఇలాంటివి సహజమేనన్నదిల్‌రాజు!

3:08 pm, Wed, 8 May 19
Dil Raju Latest Updates News, Tollywood Latest News, Newsxpressonline
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం మహర్షి. ఈ మహర్షి సినిమా సహనిర్మాత దిల్ రాజు ఇంటిపై కొద్దిసేపటి క్రితం ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ఇంటితో పాటు ఆయన ఆఫీసులోనూ ఈ సోదాలు నిర్వహించారు. మహర్షి సినిమా బిజినెస్ భారీ స్థాయలో జరిగినట్లు సమాచారం రావడంతో అధికారులు ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.

అయితే ,ఈ ఐటీ దాడులను దిల్ రాజు లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడంపై ఆయన స్పందిస్తూ..‘ఐటీ దాడులు జరగడం అన్నది కామన్. పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో ఇలాంటి సోదాలు జరుగుతూనే ఉంటాయి.

దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. మహేశ్ బాబు, పూజాహెగ్డే జంటగా, ప్రకాశ్ రాజ్, అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను వంశీపైడిపల్లి తెరకెక్కించగా, దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ నిర్మించారు. ఈ సినిమా మే 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.