పెళ్లిపీటలెక్కిన మరో నటుడు.. బంధువుల అమ్మాయిని పెళ్లాడిన ‘రంగస్థలం’ మ‌హేష్

4:58 pm, Thu, 14 May 20

హైదరాబాద్: పెళ్లిళ్లకు నేడు దివ్యమైన ముహూర్తం ఉండడంతో  లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ చాలా పెళ్లిళ్లు జరిగాయి. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కూడా ఈ రోజు ఓ ఇంటివాడయ్యాడు. ప్రేయసి పల్లవి మెడలో మూడుముళ్లు వేశాడు.

అలాగే, ‘రంగస్థలం’ ఫేమ్‌ మహేశ్‌ ఆచంట కూడా నేడు పెళ్లిపీటలెక్కాడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన మహేశ్‌.. తన బంధువుల అమ్మాయి పావనిని పెళ్లి చేసుకున్నాడు

ఇటీవలే మ‌హేష్‌, పావనిల నిశ్చితార్థం జరిగింది. నేడు అతికొద్దిమంది కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో ఇద్ద‌రు ఏడ‌డుగులు వేశారు.

కొత్త జంటకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. జ‌బ‌ర్థ‌స్త్ కార్య‌క్రమంతో పాపులారిటీ పొందిన మ‌హేష్ రంగస్థలం చిత్రంలో రామ్ చ‌రణ్‌‌తో కలిసి న‌టించాడు. మ‌హాన‌టి చిత్రంలో ముఖ్య పాత్ర పోషించాడు.