రాంగోపాల్‌వర్మ కార్యాలయంపై జనసేన కార్యకర్తల దాడి.. పోలీసుల అదుపులో ఆరుగురు

- Advertisement -

హైదరాబాద్‌ : ‘పవర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’ పేరుతో సినిమాను తెరకెక్కించి మరో వివాదానికి తెరతీసిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ కార్యాలయంపై నేడు దాడి జరిగింది.

జూబ్లీహిల్స్‌లోని ఆయన కార్యాలయంపై జనసేన కార్యకర్తలుగా చెబుతున్న కొందరు దాడి చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనతో ప్రమేయమున్న పలువురు జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

రామ్‌గోపాల్‌ వర్మ ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’ సినిమా ఇటీవల పెను సంచలనానికి కారణమైంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రాజకీయ జీవితంపై వ్యంగ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 

 ఈ సినిమాపై పవన్‌ అభిమానుల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. మరోవైపు ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’ చిత్రానికి కౌంటర్‌గా రామ్‌గోపాల్‌ వర్మపై హీరో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ‘పరాన్న జీవి’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

కాగా, తన కార్యాలయంపై పవన్ కల్యాణ్ అభిమానులు దాడిచేసినట్టు కొద్దిసేపటి క్రితం రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. తన కార్యాలయంపై దాడి చేసి ‘పవర్ స్టార్’కు మరింత పాప్యులారిటీ తీసుకొచ్చారని పేర్కొన్నాడు.

- Advertisement -