ఎన్టీఆర్ పాటకు డ్యాన్స్ ఇరగదీసిన జపాన్ జంట.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియో

- Advertisement -

హైదరాబాద్: 2006లో వచ్చిన ఎన్టీఆర్ సినిమా ‘అశోక్’ గుర్తుందా? బాక్సాఫీసు వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపకపోయినా మ్యూజికల్ హిట్‌గా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలోని ‘గోల గోల’ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మరేపుతోంది.

అలా దుమ్ము రేపుతున్నది మనోళ్లు కాదు.. జపాన్ జంట. ఈ పాటకు వారు చేసిన డ్యాన్స్‌కు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎన్టీఆర్ అభిమానులైతే పులకించిపోతున్నారు.

- Advertisement -

ఎన్టీఆర్, సమీరారెడ్డి వేసిన డ్యాన్స్‌ను అచ్చుగుద్దినట్టు అలా దింపేసిందీ జంట. హావభావాలు కూడా సూపర్. అందులోని యువకుడైతే ఏకంగా ఎన్టీఆర్‌ను తలపించాడు. ఈ వీడియోను మీరూ చూడండి.

- Advertisement -