ఒళ్ళంతా టాలెంట్ ఉన్న వ్యక్తి ఆ హీరోనే…

- Advertisement -

హైదరాబాద్: యంగ్ హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిప్పీ’. ప్రస్తుతం షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 6వ తేదీన విడుదల అవడానికి సిద్ధమైంది. ఇక ఈ చిత్రంలో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించే జేడీ చక్రవర్తి కూడ ఓ ప్రధాన పాత్రలో చేస్తున్నారు.

అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా జేడీ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  తారక్ అంటే తనకు చాలా ఇష్టమని, ఇక ఒళ్లంతా టాలెంట్ నింపబడిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పాడు.

అయితే ఎప్పుడూ సరదాగా వుంటూ నవ్వించే తారక్, ఒక్కోసారి తన పక్కనున్నవారిని ఒక రేంజ్ లో టెన్షన్ పెట్టేస్తాడని అన్నారు. ఈ సందర్భంగా నిజజీవితంలో ఎన్టీఆర్‌కి తనకు మధ్యలో జరిగిన ఓ సన్నివేశాన్ని చెప్పారు.

‘ఒకసారి  కార్లో ఎక్కించుకుని బయలుదేరాడు. ‘మేఘాలలో తేలిపొమ్మన్నది .. ‘సాంగ్ ఫుల్ సౌండ్ పెట్టేసి కళ్లు మూసుకుని కారు డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. అలా ఆయన 110 కిలోమీటర్ల స్పీడ్ తో కారు డ్రైవ్ చేస్తుంటే నేను చాలా భయపడిపోయాను. కారు ఆపిన తరువాత ‘ఇక జన్మలో నీ కారు ఎక్కను’ అని చెప్పాను .. నిజంగానే ఇంతవరకూ ఎక్కలేదు” అని జేడీ చెప్పుకొచ్చాడు.

చదవండితెలంగాణ హీరోల క్లాష్: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌పై విశ్వక్‌సేన్ ఫైర్…
- Advertisement -