అదిరిపోయిన జెర్సీ బిజినెస్! లాభాల బాట పడతాడా?

4:33 pm, Thu, 18 April 19
nani jercy pri release business

హైదరాబాద్: రేపు విడుదల కానున్న జెర్సీ మీద నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇది రిలీజ్ కు ముందు అందరు హీరోలు వ్యక్తం చేసేదే కాబట్టి అందులో ఆశ్చర్యం లేదు కాని అభిమానులు మాత్రం తమ హీరో హిట్టు కొట్టాలని బలంగా కోరుతున్నారు. గత ఏడాది రెండు చేదు అనుభవాలు ఎదురైన దృష్ట్యా ఇది హిట్ కావడం నానికి చాలా అవసరం.

ఇప్పుడు దీని వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 26 కోట్ల దాకా జరిగిందని సమాచారం. నాని ఇమేజ్ కి ఇది సరైన మొత్తమే అయినప్పటికీ కంటెంట్ లో ఉన్న రిస్క్ బాబు తండ్రిగా నటించడం సెంటిమెంట్ డోస్ ఎక్కువైన ఫీలింగ్ కలవడం కొంత ప్రభావం చూపించే అవకాశం ఉన్నాయి ఇక ఏరియా వారిగా జెర్సీ బిజినెస్ గురించి ట్రేడ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఈ విధంగా ఉంది

నైజాం / ఉత్తరాంధ్ర – 10 కోట్లు
సీడెడ్ – 3 కోట్ల 15 లక్షలు
ఈస్ట్ గోదావరి – 1 కోటి 63 లక్షలు
కృష్ణా – 1 కోటి 42 లక్షలు
గుంటూరు – 1 కోటి 82 లక్షలు
వెస్ట్ గోదావరి – 1 కోటి 24 లక్షలు
నెల్లూరు – 81 లక్షలు
తెలుగు రాష్ట్రాలు మొత్తం – 20 కోట్ల 08 లక్షలు
రెస్ట్ అఫ్ ఇండియా – 1 కోటి 88 లక్షలు
ఓవర్సీస్ – 4 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ – 26 కోట్లు.

నానికి ఇది సవాలే. యూత్ స్టోరీనో లేదా ఫామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసే ఎంటర్ టైనరో లేదా కమర్షియల్ సినిమానో అయితే కంటెంట్ బాగుంటే ఈ మొత్తాన్ని ఈజీగా రాబట్టుకోవచ్చు. కానీ జెర్సి కేసు అది కాదు. సెంటిమెంట్ ఎమోషన్స్ కు పెద్ద పీఠ వేశారు.

అందులోనూ క్రికెట్ అంటే అందరికి కనెక్ట్ అయ్యే థీమ్ కాదు. ఆటను ఎంత ఇష్టపడి చూసేవాళ్ళు ఉన్నా దాన్ని డ్రమాటిక్ గా తెరమీద చూపిస్తే డబ్బులిచ్చి టికెట్ కొని చూడాలంటే చాలా సాలిడ్ కంటెంట్ ఉండాలి. పైగా ఊర మాస్ హారర్ కామెడీ కాంచన 3 పోటీలో ఉంది. ఈ నేపథ్యంలో జెర్సి కి పరిస్థితులు కేక్ వాక్ చేసేంత అనుగుణంగా లేవన్నది వాస్తవం