కూతురికోసం మరోసారి మెగా ఫోన్ పట్టనున్న జీవిత!

2:42 pm, Mon, 8 April 19
jeevitha

హైదరాబాద్: జీవిత, రాజశేఖర్ తమ పెద్ద కూతురైన శివాత్మికను కథానాయికగా తెలుగు తెరకు పరిచయం చేయాలని కొంతకాలం క్రితమే నిర్ణయించుకున్నారు. వెంకట్ దర్శకత్వంలో ‘2 స్టేట్స్’ సినిమా ద్వారా శివాత్మికను పరిచయం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

శివాత్మిక నాయికగా 2 స్టేట్స్…

అడివి శేష్ హీరోగా , శివాత్మిక హీరోయిన్ గా ఈ సినిమా షూటింగు మొదలై కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు వెంకట్ కు, అడివి శేష్ కి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది.

శివాత్మిక తొలి సినిమా ఇలా ఆగిపోవడం బాధించడంతో, ఎలాగైనా ఈ సినిమాను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే నిర్ణయానికి జీవిత – రాజశేఖర్ వచ్చారట. జీవితకి దర్శకత్వంలో మంచి అనుభవం వుంది.

పైగా 2 స్టేట్స్ రీమేక్ కావడం వలన పెద్దగా సమస్య ఉండదు. అందువలన ఎన్నికల హడావిడి పూర్తయిన తరువాత ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను జీవిత తన చేతిలోకి తీసుకోనుందని చెప్పుకుంటున్నారు.