జూలై 30, 2020…ఇప్పట్లో ఫస్ట్ లుక్, టీజర్స్ లేవు!

12:50 pm, Thu, 14 March 19
July 30, 2020 ... First Look No Teasers!, Newsxpressonline

హైదరాబాద్: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను వచ్చే సంవత్సరం జూలై 30వ తేదీన దేశవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నెలలో రామ్ చరణ్ పుట్టిన రోజు, మే నెలలో తారక్ పుట్టినరోజులు ఉన్న సందర్భంగా, సినిమాలో వారి లుక్స్, టీజర్స్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయా? అన్న ప్రశ్నకు రాజమౌళి సమాధానం చెప్పారు.

సినిమాను వచ్చే సంవత్సరమే విడుదల చేస్తామని, సినిమా విడుదలకు చాలా సమయం ఉన్నందున టీజర్ లు, ఫస్ట్ లుక్ లు ఉండబోవని స్పష్టం చేశారు. ఇప్పడే వాటిని విడుదల చేయడం టూ ఎర్లీ అవుతుందన్నారు. ఆ వెంటనే తారక్ కల్పించుకుంటూ, “అక్కడో మార్చి, మే ఉంది కదాండి” అనడంతో ఆడిటోరియంలో నవ్వులు పూశాయి.