‘కనులు కనులను దోచాయంటే’ నిర్మాత నందగోపాల్‌రెడ్డి దుర్మరణం

- Advertisement -

నల్గొండ:  టాలీవుడ్‌ నిర్మాత నందగోపాల్‌రెడ్డి దుర్మరణం పాలయ్యారు. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందగోపాల్‌రెడ్డితోపాటు ఆయన కుమారుడు కూడా మృతి చెందారు.

నెల్లూరు జిల్లాకు చెందిన గుండాల కమలాకర్‌రెడ్డి, నందగోపాల్‌రెడ్డి (75) తండ్రీకుమారులు. నందగోపాల్‌రెడ్డి గతంలో ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాను మరొకరితో కలిసి నిర్మించారు.

- Advertisement -

ఇటీవల అనారోగ్యం బారినపడిన నందగోపాల్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చూపించేందుకు కుమారుడు కమలాకర్‌రెడ్డి తండ్రితో కలిసి అంబులెన్స్‌లో బయలుదేరాడు.

ఈ క్రమంలో నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీకుమారులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

అంబులెన్స్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -