ఆసక్తికరం: RRR మూవీకి కేటీఆర్ చెప్పిన టైటిల్ ఇదే!

5:00 pm, Mon, 29 April 19
RRR Movie Latest Updates, KTR Latest News, Tollywood Movie News, Newsxpressonline

హైదరాబాద్: సోషల్ మీడియాలో వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఎప్పుడు యాక్టీవ్‌గానే ఉంటారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇస్తుంటారు.

అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్‌లను ఒకే స్క్రీన్ మీదకు తెచ్చేసి భారీ మల్టీ స్టారర్‌గా దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న RRR సినిమాపై ఏ చిన్న వార్త వచ్చినా అది వైరల్ అవుతోంది.

ఇలాంటి తరుణంలో సినిమాలపై తనదైన శైలిలో కామెంట్లు చేసే అలవాటు ఉన్న కేటీఆర్ ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్ చేశారు. కామెంట్ చేయడమే కాదండీ బాబూ… ఏకంగా ఈ చిత్రానికి కేటీఆర్ టైటిల్ కూడా పెట్టేశారు.

సోమవారం మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా ‘ఆస్క్ కేటీఆర్’ పేరిట ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్.. నెటిజన్లు అడిగిన ప్రతి ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించారు.

RRR గురించి అడగ్గానే…

#RRR సినిమాకు మీరే టైటిల్ చెప్పండంటూ రాజమౌళి… తారక్, చెర్రీ అభిమానులకు ఓ పజిల్ విసిరిన సంగతి తెలిసిందే కదా.  ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఎదురైన ప్రశ్నకు స్పందించిన కేటీఆర్… ఆ సినిమాకు తానైతే ఈ పేరు పెడతానంటూ ఓ ఆసక్తికర పేరును ప్రస్తావించారు. 

కేటీఆర్‌తో ట్విట్టర్ ఇంటరాక్షన్‌లో రాజమౌళి పజిల్‌ను ప్రస్తావించిన ఓ నెటిజన్… మీరైతే ఈ సినిమాకు ఏం టైటిల్ సూచిస్తారని ఆయన్ని ప్రశ్నించారు. మరి ఆయనేమో పొలిటీషియన్, ప్రశ్నేమో సినిమాలకు సంబంధించినది.

ఈ క్రమంలో దీనిపై ఆయన అసలు స్పందిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉండగానే… కేటీఆర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఈ ప్రశ్నకు చాలా స్ట్రయిట్‌గా స్పందించేశారు. #RRR సినిమాకు తానైతే.. ‘రీజనల్ రింగ్ రోడ్’ అని పేరు పెడతానంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

చదవండి:  రానా సినిమాతో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్న ప్రియమణి!