మొదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అడ్వాన్స్ బుకింగ్స్! వావ్.. జస్ట్ 10 నిమిషాల్లో 1000 టిక్కెట్లా?

- Advertisement -

హైదరాబాద్: మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా, 10 నిమిషాల వ్యవధిలో ఓ మల్టీ ప్లెక్స్ లో 1000 టికెట్లు అమ్ముడు కావడాన్ని ప్రస్తావిస్తూ, ఓ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

‘‘ఓపెనింగ్స్ స్పీడ్ చూస్తుంటే కథానాయకుడు, మహానాయకుడు కన్నా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ని చూడడానికే ప్రజలు ఎగబడుతున్నారు, అంటే నిజంగా నిజమే గెలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.. జై బాలయ్య..’’ అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో హౌస్‌ఫుల్ అయినట్టు చూపుతున్న థియేటర్ సీటింగ్ స్క్రీన్ షాట్‌ను కూడా యాడ్ చేశారు.


 

- Advertisement -