‘‘మా భాష మీద నవ్వినవ్.. మా ముఖాల మీద ఊసినవ్..’’: వర్మ ఏం చేసినా వివాదాస్పదమేనా?

12:07 pm, Sat, 20 April 19
Ram Gopal Varma Latest News, KCR Latest News, Telangana News, Newsxpressonline

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం సాగించిన వైనం ప్రధానాంశంగా రామ్ గోపాల్ వర్మ నిర్మించతలపెట్టిన ‘టైగర్ కేసీఆర్’కు చెందిన ఓ పాట లిరిక్స్ ఇప్పుడు తీవ్ర వివాదం రేపేలా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే వర్మ ఆ పాట లిరిక్స్‌ను హమ్ చేస్తూ వీడియో విడుదల చేశారు.

‘‘మా భాష మీద నవ్వినవ్… మా ముఖాల మీద ఊసినవ్… మా బాడీల మీద నడిసినవ్ ఆంధ్రోడా… వస్తున్నా… వస్తున్నా… మీ తాటతీయనీకి వస్తున్నా…’’ అంటూ తాను ప్రకటించిన ‘టైగర్ కేసీఆర్’లోని ఓ సాంగ్ లిరిక్స్‌ను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వయంగా పాడుతూ వీడియో తీసి యూట్యూబ్ లో విడుదల చేశారు.

చదవండి: మరో వివాదానికి తెరతీసిన వర్మ! టైగర్ కేసీఆర్‌లో రామోజీరావు పాత్ర!

టైగర్ కేసీఆర్ కమింగ్ సూన్ అని కూడా ఆయన అన్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఇది ఆంధ్రులనందరినీ అవమానించేలా ఉందని, ఈ పాటను అంగీకరించేది లేదని కామెంట్లు పెడుతున్నారు. మరి వీటిపై వర్మ ఎలా స్పందిస్తాడో!?