‘మా’ నూతన కార్యవర్గం భేటీ! తొలి సమావేశంలోనే.. సంచలన నిర్ణయాలు!

- Advertisement -

హైదరాబాద్ : గతంలో కన్నా ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు నరేష్ ప్యానల్, శివాజీ రాజా ప్యానల్ మధ్య రసవత్తరంగా జరగటం తెలిసిందే. ఎన్నికల వేళ ఇరు ప్యానల్స్ అభ్యర్థుల మధ్య మాటలు యుద్ధం. ఆ తర్వాత ఒక్కక్కటిగా వివాదాలు రెండు ప్యానల్స్ మధ్య పెరుగుతూ వచ్చాయి.

ఇప్పటికీ కూడా ఇద్దరి మధ్య ఈ గొడవలు ఒక కొలిక్కి రాకపోవటం తెలిసిన విషయమే. మరోవైపు నరేష్ ప్యానల్ సభ్యుల ప్రమాణ స్వీకారం విషయంలో కూడా పెద్ద రగడే జరిగింది. ఇదిలా ఉండగా, తాజాగా మా నూతన కార్యవర్గం తొలి సమావేశం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ మీటింగ్‌కు అధ్యక్షుడు నరేశ్.. జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్.. ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు సమావేశమయ్యారు. రానున్న రెండేళ్లకు వారు తీసుకోబోయే కీలక నిర్ణయాల్ని వెల్లడించారు.

‘మా’ తీసుకునే కొత్త నిర్ణయాలు ఇవే..

‘మా’లో సభ్వత్వం తీసుకున్న ఆర్టిస్ట్స్ తమ సమస్యలను తెలిపేందుకు హెల్ప్ లైన్ 9502030405లో సంప్రదించాలి. పింఛను తీసుకునే సభ్యులకు ఈ ఏడాది నుంచి 6 వేల రూపాయలను పింఛను కింద వారి ఖాతాలో జమ చేస్తారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ‘మా’ సభ్యులకూ వర్తింపజేసేలా ఓ నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా సభ్యత్వం తీసుకునే వారికీ రెండు రకాల పద్ధతులను ప్రవేశ పెడుతున్నారు.

1) రూ.25 వేలు చెల్లించిన నూతన సభ్యునికి గోల్డ్ కార్డు ఇస్తారు. దీని కాలపరిమితి రెండేళ్లు. ఈ రెండేళ్లలో మిగతా రూ.75 వేలు చెల్లిస్తే.. వారు జీవితకాల సభ్యత్వ కార్డు పొందుతారు. శాశ్వత సభ్యునిగా గుర్తింపు పొందనంత వరకు ‘మా’ తరపున ఎలాంటి సౌకర్యాలు వీరికి వర్తించవు.

(2) రెండో పద్ధతిలో రూ.90 వేలు చెల్లించిన వారికి రూ.10 వేల రాయితీతో పాటు శాశ్వత సభ్యత్వ కార్డు అందజేస్తారు. ఈ అవకాశం 100 రోజులు మాత్రమే ఉంటుంది.  ‘మా’ సభ్యులందరికీ ఈ ఏడాది నుంచి ఎస్‌బీఐ సంపూర్ణ సురక్షా జీవిత బీమాను మూడు లక్షలకు పెంచుతున్నారు.

చదవండి:  లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రేపు ఏపీలో రిలీజ్ అవుతుందా?
- Advertisement -