సెలవులో నరేశ్.. ‘మా’ తాత్కాలిక అధ్యక్షుడిగా బెనర్జీ

9:26 pm, Wed, 4 March 20

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడిగా బెనర్జీ నియమితులు అయ్యారు. ఆయన అసలు పేరు మాగంటి వేణు బెనర్జీ. చిత్రపరిశ్రమలో ఆయన బెనర్జీగా సుపరిచితులు.

ప్రస్తుత మా అధ్యక్షుడు డాక్టర్ వీకే నరేష్ 41 రోజులు సెలవు తీసుకున్నారు. దీంతో బై లాస్ ప్రకారం డిసిప్లినరీ కమిటీ, ఎక్జిక్యూటివ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అయిన బెనర్జీని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకుంది.

నేటి (బుధవారం) సాయంత్రం ఫిలిం చాంబర్ హాల్లోని మా అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ భేటీలో బెనర్జీని యాక్టివ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సమావేశంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, మురళీమోహన్, జయసుధతో పాటుగా యాక్టివ్ ప్రెసిడెంట్ బెనర్జీ, ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్, హేమ, రాజీవ్ కనకాల, శివబాలాజీ, అనిత చౌదరి, జయలక్ష్మి, కరాటే కళ్యాణి, ఏడిద శ్రీరామ్, రవి ప్రకాష్ టార్జాన్, పసునూరి శ్రీనివాస్, రాజా రవీంద్ర, ఆలీ, సురేష్ కొండేటి, తనీష్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.