కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: సినిమా కోసం కీర్తి సురేష్ ఇంత పని చేయనుందా?

- Advertisement -

హైదరాబాద్: కరోనా కారణంగా ఆర్ధికంగా సవాళ్ళను ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ కూడా ఒకటి. అయితే లాక్‌డౌన్‌ను విధించి కొంతమేర కరోనాను అదుపు చేయగలుగుతోంది.

ఈ నేపథ్యంలో అన్ని పరిశ్రమలు ఆర్ధికంగా కుదేలయ్యాయి.  అందులోనూ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

- Advertisement -

లాక్‌డౌన్ తర్వాత మిగిలిన అన్ని రంగాల్లో కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ సినీ రంగం మాత్రం ఇంకా కామ్‌గానే ఉండిపోయింది.

ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో చెప్పడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ పెరగకుండా ఉండేందుకు పలువురు నటీనటులు తమంతట తామే పారితోషికాల్లో కోతలు విధించుకుంటున్నారు. 

రెమ్యునరేషన్‌లో కోతకూ సిద్ధం…

తాజాగా ‘మహానటి’ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన రెమ్యునరేషన్‌లో కోత విధించుకుందట. తన పారితోషికంలో 20 నుంచి 30 శాతం తగ్గించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించిందట.

కీర్తి నిర్ణయంపై పలువురు నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ చిత్రం ఈ నెల 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

కీర్తి చేతిలో ప్రస్తుతం ‘గుడ్ లక్ సఖి’, ‘రంగ్ దే’, ‘మిస్ ఇండియా’, ‘అన్నాత్తే’, ‘మరక్కర్’ చిత్రాలు ఉన్నాయి. మహేష్ ‘సర్కారు వారి పాట’ కోసం కూడా కీర్తిని సంప్రదించినట్టు సమాచారం.

చదవండి: అభిమానులను కలచివేసిన సుశాంత్ మరణం.. ‘బాలీవుడ్ బాయ్‌కాట్’కు పిలుపు
- Advertisement -