యూఎస్ఏలో ‘బాహుబలి 2’ రికార్డ్ బద్దలు కొట్టిన ‘మహర్షి’…

7:36 am, Tue, 7 May 19
mahesh vs prabhash

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం మహర్షి. ఈ సినిమా వేసవి కానుకగా మే 9 న రిలీజ్ కానుంది. ఇకపోతే మహర్షి చిత్రం రిలీజ్ ముందే పలు సంచలన రికార్డులు నమోదు చేస్తోంది.

తాజాగా ఓవర్సీస్ ప్రీమియర్ షోల విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ రికార్డ్ సొంతం చేసుకోవడంతో పాటు బాహుబలి 2 రికార్డును సైతం బద్దలు కొట్టబోతోంది అని తెలుస్తోంది.

గతంలో మహేష్ బాబు నటించిన ‘అతడు’, ‘ఆగడు’, ‘పోకిరి’, ‘భరత్ అనే నేను’ చిత్రాలను యూఎస్ఏలో డిస్ట్రిబ్యూట్ చేసిన గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ తాజాగా ‘మహర్షి’ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుంది.  మహేష్ బాబు సినిమాలకు విదేశీ మార్కెట్లో మంచి క్రేజ్ ఉండటంతో ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు వారు ప్లాన్ చేశారు.

అసలు విషయానికొస్తే … యూఎస్ఏ వ్యాప్తంగా ‘మహర్షి’ చిత్రాన్ని 260 లొకేషన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మహేష్ బాబు కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ రికార్డ్ అని చెప్పాలి. మహేష్ బాబు మేనియాను క్యాష్ చేసుకునేందుకు ఇండియా కంటే ఒకరోజు ముందు మే 8వ తేదీన ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

‘మహర్షి’ చిత్రాన్నిమొదటి రోజు దాదాపు 2500 ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నారని సమాచారం. టాలీవుడ్ బిగెస్ట్ హిట్ ‘బాహుబలి 2’ చిత్రాన్ని అప్పట్లో దాదాపు 2000 ప్రీమియర్ షోలు వేశారు. ఇండియన్ ఫిల్మ్ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్.

మళ్ళీ ఇన్ని రోజులకి మహేష్ బాబు ‘మహర్షి’ ఆ రికార్డ్ బద్దలు కొడుతూ, రాబోయే సినిమాలకు పెద్ద బెంచ్ మార్క్ సెట్ చేయబోతుంది. అప్పట్లో ‘బాహుబలి’ సినిమా కేవలం ప్రీమియర్ షోల ద్వారానే 3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

మరిప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ ఆ రికార్డ్ బద్దలు కొడుతుందా, లేదా అనేది. మహర్షి యూఎస్ఏ ప్రీమియర్ షోలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ మే 3వ తేదీనే మొదలైంది. కొన్ని లొకేషన్లలో టికెట్స్ మీద ఆఫర్స్ కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల డిస్కౌట్లు అందుబాటులో ఉన్నట్లు గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇప్పటికే దాదాపు సగం టిక్కెట్లు అమ్ముడైనట్లు సమాచారం.

మే 8వ తేదీ వరకు అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చే అవకాశం ఉంది అని గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ సంస్థ వెల్లడించింది. మహేష్ బాబు గత చిత్రం ‘భరత్ అనే నేను’ ఓవర్సీస్ మార్కెట్లో లైఫ్ టైమ్ రన్‌లో రూ. 30 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో పాటు రూ. 16 కోట్ల షేర్ రాబట్టింది. మహర్షి సినిమాను రూ. 18 కోట్లు దిల్ రాజు బేరం పెట్టగా , ఎవరూ అంత భారీ మొత్తం పెట్టడానికి ముందుకు రాక పోవడంతో గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ రూ. 14 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న రిషి సందడి ఏ విధంగా ఉంటుందో చూడాలి ..