వీకెండ్ వ్యవసాయంతో కలెక్షన్ల పంట పండిస్తున్న ‘మహర్షి’

9:46 pm, Mon, 13 May 19

హైదరాబాద్: తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి చిత్రం విజయకేతనం ఎగురవేస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

మూడు గెటప్పుల్లో నటించి మెప్పించిన మహేష్ బాబు వీకెండ్ వ్యవసాయం ట్రెండ్ తో జనాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. అతని నటన యువతని బాగా ఆకట్టుకుంది. వ్యవసాయంపై మనసు మళ్లేలా చేసింది.

నటీనటుల ప్రతిభ గురించి పక్కన పెడితే.. దర్శకుడికే ఎక్కువ ప్రశంసలు దక్కాలి. మహర్షి ద్వారా సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వడంతో పాటు రైతులకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించడంలోనూ వంశీ సక్సస్ అయ్యాడనే చెప్పాలి.

చదవండి: కాలర్ ఎగరేసిన మహేష్! వారంలో అన్ని రికార్డులు గల్లంతు!

వీకెండ్ వ్యవసాయం అనే ఈ సరికొత్త ఆలోచన యువకుల్లో వ్యవసాయం పట్ల ఉన్న అభిమానాన్ని తట్టి లేపడంతో పాటు నడుంవంచి పొలంలో పని చేసేలా చేస్తుంది.

కొన్ని సాఫ్ట్వేర్ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులతో వీకెండ్ వ్యవసాయం చేయుస్తున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

దీనితో సాధారణ ఉద్యోగులు సైతం పొలాల్లో పని చేస్తూ.. తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఒకరకంగా ఇదంతా రైతులతో పాటు మహర్షి చిత్రానికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. రైతుల పట్ల చూపిన సన్నివేశాలు, అది చూసి యూత్ ఫాలో అవ్వడంతో ఈ చిత్రానికి ఉచిత పబ్లిసిటీ బాగానే వచ్చింది.

ఉచిత పబ్లిసిటీ అయినా భారీగా కాసుల వర్షం కురిపిస్తోంది. 4 రోజుల్లోనే మహర్షి చిత్రం 100కోట్లు వసూలు చేసిందంటే అదంతా వ్యవ’సాయం’ అందించిన సాయమే..

చదవండి: బాలయ్యతో గొడవలు లేవు….కానీ ఆ కారణంతోనే ఎన్టీఆర్ నుంచి తప్పుకున్న: డైరెక్టర్ తేజ