ఓవర్శిస్ లో నిరాశపరిచిన మహర్షి! షాక్ లో నిర్మాతలు!

11:19 am, Sat, 11 May 19
Mahesh Babu Latest Updates, Maharshi Latest Movie News, Tollywood News, Newsxpressonline
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం మహర్షి. సినిమాపై ముందు నుంచీ భారీ అంచనాలు ఉండటంతో ఓవర్సీస్ మార్కెట్లో బిగ్గెస్ట్ రిలీ‌జ్‌ చేశారు. 2500పైగా ప్రీమియర్ షోలు వేశారు. యూఎస్ఏలో బాహుబలి మూవీని మించిపోయే స్థాయిలో షోలు పడ్డాయి.

ఇంత భారీ మొత్తంలో రిలీజ్ అవ్వడం తో అప్పటి వరకు యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఉన్న నాన్ బాహుబలి ప్రీమియర్ షో కలెక్షన్ రికార్డులన్నీ బద్దలవుతాయని అంచనా వేశారు. ‘మహర్షి’ మూవీ ప్రీమియర్ షోల ద్వారా 2 మిలియన్ డాలర్ మార్కును అందుకుంటుందని అంచనా వేశారు. అయితే అందరి అంచనాలు తారు మారయ్యాయి.

యూఎస్ఏలో బాహుబలి 2, భరత్ అనే నేను లాంటి పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ సంస్థ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకుంది. మహర్షి చిత్రాన్ని యూఎస్ఏలో 260 లొకేషన్లలో విడుదల చేశారు.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 224 లొకేషన్ల నుంచి $502k వసూలైంది. ఇది మంచి మొత్తమే అయినప్పటికీ…. అంచనాలను అందుకునే స్థాయిలో మాత్రం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కనీసం 1 మిలియన్ మార్క్ అందుకోక పోవడం నిరాశ పరిచే విషయమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.