‘మహర్షి’ ఫస్ట్ రివ్యూ ! బొమ్మ బ్లాక్ బ్లాస్టర్!

10:40 am, Wed, 8 May 19
Maharshi Movie review News, Mahesh Babu Latest News, Tollywood News, Newsxpressonline

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మహర్షి. సూపర్ స్టార్ కెరీర్లో 25వ ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ముందు నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ట్రైలర్ రిలీజ్ తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ మరింత ఎక్కువయ్యాయి. సినిమా బ్లాక్ బస్టర్ విజయం ఖాయం అనే టాక్ ఇప్పటికే స్ప్రెడ్ అయింది.

తాజాగా యూఏఈ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు నుంచి కూడా మహర్షి మూవీ విషయంలో సూపర్ పాజిటివ్ రివ్యూ వచ్చేసింది. యూఎఈలో సెన్సార్ కాపీ చూసి అనంతరం ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. మహర్షి మూవీ అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న అద్భుతమైన సినిమా. తీరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది అంటూ పొగడ్తలు గుప్పించాడు.

ఉమైర్ సంధు ట్వీట్ చూస్తుంటే మహర్షి కథ ప్రేక్షకులను కట్టి పడేసే విధంగా ఉంటుందని, స్క్రీన్ ప్లే వినోదాత్మకంగా ఉంటుందని తెలుస్తోంది. హీరోయిన్ పూజా హెగ్డే తన స్టన్నింగ్ లుక్, గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిందని ఉమైర్ సంధు తెలిపారు. ఇందులో అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తన ట్వీట్లో ఉమైర్ సంధు అతడి ప్రస్తావన తేక పోవడం గమనార్హం.

అయితే చిత్ర బృందం మాత్రం నరేష్ రోల్ కథలో బాగా హైలెట్ అయ్యేలా ఉంటుందని స్పష్టం చేస్తున్నాడు. మహర్షి’ చిత్రం పైసా వసూల్ ఎంటర్టెనర్ అని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందని ఉమైర్ సంధు స్పష్టం చేశాడు. అంతే కాదు ఈ చిత్రానికి 4/5 రేటింగ్ ఇస్తున్నట్లు చెప్పాడు.