మహర్షికి మరో కొత్త తలనొప్పి! తేడా వస్తే ఇక అంతే! 

1:54 pm, Fri, 26 April 19
maharshi run time, newsxpress.online

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది. టాలీవుడ్‌లో ముగ్గురు అగ్ర నిర్మాతలు అయిన దిల్ రాజు – చలసాని అశ్వనీదత్ – పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే స్పీడ్ అందుకున్నాయి. మే 9న రిలీజ్ అవుతోన్న మహర్షి సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ పంక్షన్‌ను మే 1న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై టాలీవుడ్ బిజినెస్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి.పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా ఫైనల్ రన్ టైం లాక్ అయ్యింది. సినిమా నిడివి 2 గంటల 50 నిముషాలు వచ్చిందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ స్టార్ హీరో సినిమాకు 170 నిమిషాల నిడివి అంటే చాలా ఎక్కువ. బాహుబలి, శ్రీమంతుడు, భరత్ సినిమాల నిడివి కూడా చాలా ఎక్కువే. 

సినిమాలో కంటెంట్ ఉండాలే కాని ప్రేక్షకుడు అంతసేపు అయినా కూర్చుని చూస్తాడు… అదే సినిమా లాగ్ అయితే మాత్రం బోర్ ఫీలవుతాడు… సినిమా రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. సినిమా యావరేజ్‌గా ఉండి, లాగ్ అయితే మళ్లీ రెండోసారి థియేటర్‌కు వచ్చేందుకు ఇష్టపడడు.

ఇక మహర్షి టోటల్ నిడివి ఏకంగా 4 గంటల పాటు వచ్చిందట. భారీగా ట్రిమ్ చేసి చివరకు 170 నిమిషాలు రన్ టైం ఫిక్స్ చేసినట్టు తెలిసింది. ఫైనల్ రషెష్ చూసిన నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నట్టు తెలుస్తోంది. అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా హిట్ అవ్వడం అటు ముగ్గురు నిర్మాతలతో పాటు మహేష్‌కు, ఇటు దర్శకుడు వంశీకి కీలకం కానుంది.