నా కెరియర్ లో మహర్షి మరచిపోలేని మూవీ: మహేష్ బాబు

10:23 am, Sat, 11 May 19
Mahesh Babu Latest Movie News, Maharshi Latest Updates, Tollywood News, Newsxpressonline
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి చిత్రానికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ, రైతుల ప్రాముఖ్యత, దేశానికి వారి అవసరాన్ని గుర్తు చేస్తూ సందేశాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు.

ముందు నుంచీ ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో మహర్షి చిత్రం తొలిరోజు అద్భుతమైన వసూళ్లు సాధించింది. నైజాంతో పాటు కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను సైతం బద్దలు కొట్టింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంపై మహేష్ బాబుతో పాటు చిత్ర బృందం హ్యాపీగా ఉంది. ఈ విజయంపై మహేష్ బాబు స్పందించారు.

మీ అభిమానం వల్ల నా జర్నీ ఎంతో ప్రత్యేకంగా సాగుతోంది. నేను నటించిన 25వ సినిమాను ఆదరించి నా కెరీర్లోనే బిగ్గెస్ట్‌గా చేశారు. మీ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా ఉంది. అభిమానులకు, ప్రేక్షకులకు థాంక్స్ అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ట్వీట్ చేశారు.

మహర్షి చిత్రానికి అద్భుతమైన టీమ్ పని చేసింది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమాను హ్యాండిల్ చేసిన విధానం ఎంతో నచ్చింది. ఇదొక గొప్ప విజయం. ఇలాంటి విజయం నాకు అందించిన అందరికీ కృతజ్ఞతలు. ఇది నా గుండె లోతుల్లో నుంచి వస్తున్న స్పందన అంటూ మహేష్ బాబు భావోద్వేగానికి గురయ్యారు