సూపర్ స్టార్ తో సెల్ఫీ దిగిన మహేష్

3:39 pm, Mon, 25 March 19
Mahesh Babau Latest News, Super Star Latest News, Tollywood News, Newsxpressonline

హైదరాబాద్: నిజంగానే మహేష్ బాబు తో మహేష్ సెల్ఫీ దిగాడు. కాకపోతే ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఒకటి మైనపు విగ్రహమైతే, మరొకటి అసలైన మహేష్. హైదరాబాద్ లో మహేష్ కు చెందిన ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్లులో ఈ విగ్రహాన్ని స్వయంగా అతడే ఆవిష్కరించాడు. మొదటి సెల్ఫీని తనే తీసుకున్నాడు.

సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టడానికి ఈ మైనపు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. నిజానికి వీళ్లు ఏ మైనపు బొమ్మ తయారుచేసినా, దాన్ని తమ మ్యూజియంలోనే ఆవిష్కరిస్తారు. తొలిసారిగా ఇలా సింగపూర్ నుంచి మహేష్ మైనపు ప్రతిమను తీసుకొచ్చి హైదరాబాద్ లో ఇలా ఆవిష్కరింపజేశారు.

ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఉంచుతారు. తర్వాత సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ బ్రాంచ్ కు తరలిస్తారు. దాదాపు 3 నెలల పాటు కష్టపడి మహేష్ మైనపు విగ్రహాన్ని తయారుచేశారు. ఈ విగ్రహావిష్కరణకు మహేష్ తో పాటు అతడి కుటుంబం మొత్తం హాజరైంది

చదవండి: అఖిల్ తో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రియాంక జవాల్కర్