మహర్షి ఫస్ట్ డే కలెక్షన్స్! షేక్ అయిన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్!

11:19 am, Fri, 10 May 19
maharshi first day collections

హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన చిత్రం మహర్షి. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా బ్యానర్లపై నిర్మాతలు దిల్‌రాజు,అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా సామాజిక సందేశంతో రూపొందిన భారీ చిత్రం మహర్షి. ఈ సినిమా మహేష్‌బాబు 25వ సినిమా కావడంతో అభిమానులు, ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ గురువారం విడుదల అయ్యింది.

ఈ సినిమాలో మ‌హేశ్ బాబు చాలా బాగా న‌టించాడు. రిషి కుమార్ పాత్రలో ఒదిగిపోయాడు. కార్పొరేట్ కంపెనీ సీఈఓగా హాలీవుడ్ హీరోను త‌ల‌పించాడు. న‌ట‌న‌లో కూడా పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. అల్లరి నరేష్ కూడా రవి పాత్రకు ప్రాణం పోశాడు. ఇన్నాళ్లూ కామెడీ సినిమాలనే ఎంచుకున్న న‌రేష్. ఇప్పుడు మాత్రం ఎమోష‌న‌ల్ పాత్రలో చాలా బాగా న‌టించాడు.

ఇక కలెక్షన్ల విషయానికొస్తే.. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో మహర్షి రూ.33.5కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.61కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది మహేశ్‌బాబు కెరీర్లోనే హయ్యస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లని సినీవర్గాల సమాచారం. భరత్ అనే నేను సినిమా తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ.55కోట్ల గ్రాస్ రాబడితే ఆ రికార్డును మహర్షి బ్రేక్ చేసేసింది.