మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీలక మార్పులు!

2:19 pm, Sat, 27 April 19
Maharshi

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం మహర్షి. ఈ సినిమా మహేష్ కెరియర్లో ఒక మైలురాయిగా నిలవబోతుంది. ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే 9 న విడుదల చేయనున్నారు.

మేడే నాడు జరగబోతున్న మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చాల వేగంగా జరుగుతున్నాయి. ఈ ఫంక్షన్ లో మహేష్ ఇప్పటి వరకు నటించిన 25 సినిమాలకు సంబంధించిన దర్శకులను వేదిక పైకి పిలిచి వారిని సత్కరించాలి అన్న ఆలోచనలకు మహేష్ స్వయంగా బ్రేక్ వేసినట్లు టాక్.

దీనికి కారణం మహర్షి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను కేవలం ఆసినిమా ఫంక్షన్ గానే జరపమని ఆ ఫంక్షన్ లో తాను 25 సినిమాలు పూర్తి చేసుకున్న విషయాన్ని హైలెట్ చేస్తూ తనతో పనిచేసిన దర్శకులు అందర్నీ పిలిచి సత్కరించే కార్యక్రమాన్ని తాత్కాలికంగా బ్రేక్ వేయమని మహేష్ గట్టి సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీనికి కారణం మహర్షి ఫంక్షన్ లో ఇలాంటి వేడుకలు పెడితే మహర్షి సినిమా విషయాలు పక్కకు వెళ్లిపోయి అది తన సత్కార సభగా మారుతుందనీ మహేష్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. అనుకున్న విధంగా ‘మహర్షి’ సూపర్ హిట్ అయితే అప్పుడు దానికి సంబంధించిన ఫంక్షన్ ను మే 18న విజయవాడలో అత్యంత ఘనంగా నిర్వహించి ఆ సందర్భంలో తనతో పనిచేసిన 25 మంది దర్శకుల సత్కారాన్ని జరిపిద్ధాము అప్పటి వరకు కాస్త ఆగండి అంటూ మహేష్ ఈమూవీ దర్శక నిర్మాతలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మహేష్ తన సినిమాల సిల్వర్ జూబ్లీ మీట్ కు ఇలా బ్రేక్ చేయడం వెనుక మహర్షి సక్సస్ గురించి మహేష్ కు భయాలు ఉన్నాయా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే మహర్షి సినిమా విషయం పక్కకు పెట్టి మహేష్ నటించిన గత సినిమాల గురించి మహేష్ ఇప్పటికే సాధించిన రికార్డుల గురించి ఉపన్యాసాలు పెడితే మరీ అతిగా ఉంటుంది అన్న ఆలోచనలతో ఈ నిర్ణయం మహేష్ తీసుకున్నాడు అని అంటున్నారు..