మహేష్ 26 వ చిత్రానికి టైటిల్ ఫిక్స్!

10:34 am, Sat, 18 May 19
Mahesh babu 26th Film News, Tollywood News, Telugu Movie News, Newsxpressonline

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. పలు ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాడు. అయితే మరి కొద్ది రోజులలో అనీల్ రావిపూడితో కలిసి తన 26వ సినిమా చేయనున్నాడు మహేష్ .

ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుండగా, జూన్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు విలన్ రోల్ లో నటించనుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. దిల్ రాజు , అనిల్ సుంకర కలిసి నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి ప్రేక్షకులముందుకు రానుంది.

ఈ చిత్రానికి ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. కాని తాజాగా రెడ్డిగారి అబ్బాయి అనే టైటిల్‌ని చిత్రానికి పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. చిత్రంలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడట. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు సమాచారం.

చదవండి: బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీముఖి…ఏమిటో చూడండి?