మజిలీతో హిట్ కొట్టేసిన అక్కినేని జంట

11:46 am, Mon, 8 April 19
Naga-Chaitanya-and-Samantha-s-Majili-Movie-Latest-HD-Poster-

హైదరాబాద్: నాగచైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘మజిలీ’ సినిమా థియేటర్స్ కి వచ్చింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన థియేటర్స్ కి వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున ఈ సినిమా 11.50 కోట్ల వసూళ్లను రాబట్టింది. నాగచైతన్య కెరియర్లోనే తొలిరోజున ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు.ఇక రెండవ రోజున ఈ సినిమా 10 కోట్ల వరకూ వసూళ్లను సాధించింది. అలా రెండు రోజుల్లో ఈ సినిమా 21.50 కోట్ల వసూళ్లను రాబట్టింది.

యూత్ ను , ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ తో రావడం. ముఖ్యంగా పెళ్లి తరువాత చైతూ, సమంత కలిసి చేసిన తొలి సినిమా కావడం వలన, ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి చైతూ, సమంత హిట్ కొట్టేశారంటూ ఆ జంటకి అభినందనలు తెలియజేస్తున్నారు.