మజిలీ.. జెర్సీ.. మధ్య తేడా ఇదే…

3:40 pm, Tue, 16 April 19
majili vs jercey

హైదరాబాద్: మజిలీలో నాగచైతన్య ఓ క్రికెటర్. టాలెంట్ ఉన్నప్పటికీ కోపం కారణంగా పైకి ఎదగలేకపోయిన ఫెయిల్యూర్ క్రికెటర్. ‘జెర్సీ’లో నాని కూడా క్రికెటర్. సేమ్ టు సేమ్ పైకి ఎదగలేకపోయిన ఫెయిల్యూర్ క్రికెటర్.

‘మజిలీ’లో నాగచైతన్యకు పెళ్లి అవుతుంది. గతాన్ని తలచుకుంటూ ఉద్యోగం సజ్జోగం చేయకుండా పెళ్ళాం డబ్బుల మీద ఆధారపడి బతుకుతున్న ఓ భర్త. ‘జెర్సీ’ ట్రైలర్లో చూపించిన దానిప్రకారం… భార్య సంపాదన మీద బతికే భర్త పాత్ర నానిది.

‘జెర్సీ’ ట్రైలర్ విడుదలైన తరవాత… ప్రేక్షకుల మదిలో మొన్న మొన్ననే విడుదలైన ‘మజిలీ’ మెదిలింది. రెండు కథలు సేమ్ టు సేమా? రెండిటి మధ్య తేడా ఏం లేదా? అని ప్రశ్నించుకుంటే… ఓ తేడా ఉంది. అదే వైఫ్ క్యారెక్టర్.

‘మజిలీ’లో పనీపాటా లేకుండా తాగి తిరిగే భర్తను భార్య భరిస్తుంది. గతాన్ని మరిచి మారతాడని ఆశతో ఉంటుంది. అందులో హీరోకి ఫ్లాష్ బ్యాక్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ‘జెర్సీ’లో హీరోకి ఫ్లాష్ బ్యాక్ లో సెపరేట్ లవ్ స్టోరీ లేదు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు.

పెళ్లి తరవాత అదే అమ్మాయి హీరోని ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా? లేదా? అని నిలదీస్తుంది. వైఫ్ క్యారెక్టర్ కంటే ముఖ్యమైనది ఫాదర్ అండ్ సన్ ఎమోషన్. ట్రైలర్ చివర్లో ‘ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు వరకూ నన్ను జడ్జ్ చేయనది నా కొడుకు ఒక్కడే.

వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను అని నాని చెప్పే డైలాగ్, కొడుకు సంతోషం కోసం తాపత్రయపడే తండ్రిగా నాని నటన సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాయి. ఈ నెల 19న విడుదలవుతున్న సినిమా అంచనాలను ఎంతమేరకు అందుకుంటుందో చూడాలి.