దూసుకుపోతోన్న మజిలీ ట్రైలర్!

11:41 am, Mon, 1 April 19
Nagachaithanya Latest News, Samantha Latest News, Majili Latest Movie News, Newsxpressonline

హైదరాబాద్: నాగచైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ నిర్మితమైంది. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నిన్న ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్, యాక్షన్, ఎమోషన్ ప్రధానంగా సాగే సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది.

చాలా తక్కువ సమయంలో ఈ ట్రైలర్ కి 2 మిలియన్ డిజిటల్ వ్యూస్ రావడం విశేషం. చైతూ, సమంత పెళ్లి తరువాత చేసిన తొలి సినిమా కావడం వలన, ఈ సినిమా పట్ల భారీ అంచనాలు వున్నాయి.

ఈ సినిమా పట్ల ఏ స్థాయిలో ఆసక్తి వుందనడానికి ఉదాహరణంగా ఈ వ్యూస్ కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ వలన సినిమా విజయం పట్ల టీమ్ కి మరింత నమ్మకం పెరిగింది.