ఘనంగా మెగాడాటర్ నిహారిక నిశ్చితార్థం.. వేడుకలో కనిపించని పవన్ కళ్యాణ్!

niharika-konidela-pawan-jonnalagadda-engagement
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం గురువారం రాత్రి గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో ఘనంగా జరిగింది. 

వీరిద్దరి వివాహం త్వరలోనే జరగనుంది. గురువారం నాటి నిశ్చితర్థ వేడుకలో మెగా ఫ్యామిలీతోపాటు, చైతన్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

- Advertisement -

కరోనా సమయంలో జరుగుతున్న వేడుక కావడంతో ఈ కార్యక్రమానికి ఇరువైపుల కుటుంబాల నుంచి అతి తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు. 

నిహారిక-చైతన్యల నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్ అంద‌రూ హాజ‌ర‌య్యారు. కొత్త పెళ్లి కూతురితో ఫొటోలు దిగుతూ సంద‌డి చేశారు.

అయితే నిహారిక నిశ్చితార్థ వేడుకల్లో బాబాయి పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. దీంతో దీనిపై అనేక ఊహాగానాలు, పుకార్లు మొదలయ్యాయి. 

నితిన్ పెళ్లి వేడుక‌కు వెళ్లేంత స‌మ‌యం ఉన్న ప‌వ‌న్‌ సొంత అన్న కూతురి నిశ్చితార్థానికి వెళ్లకపోవడం ఏమిటంటూ కొంద‌రు నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

ఏమో.. వారి మధ్య ఏమైనా మనస్పర్థలు ఉన్నాయేమో అని మరికొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. 

అందుకే పవన్ రాలేదు…

అయితే అసలు విషయం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షలో ఉన్నారట. గత నెలలోనే ఆయన ఈ దీక్షకు పూనుకున్నారట. 

ఈ దీక్ష నాలుగు నెలలపాటు కొనసాగుతుందని, ఈ దీక్షలో ఉన్నప్పుడు సాయంత్రం 6 గంటల తరువాత ఇల్లు విడిచి వెళ్లరాదని తెలుస్తోంది. 

నిహారిక నిశ్చితర్థ వేడుక రాత్రిపూట కావడంతో.. ఈ కారణంగానే బాబాయి పవన్ ఆ వేడుకలో కనిపించలేదు. కానీ గురువారం ఉదయమే పవన్ నాగబాబు నివాసానికి వెళ్లి నిహారిక, చైతన్యలను మనసారా ఆశీర్వదించినట్లు సమాచారం. 

niharika-engagement-pawan-kalyan

- Advertisement -