మెగా హీరో సాయిధరమ్ తేజ్ చిత్రం ప్రీ లుక్ విడుదల

12:35 pm, Tue, 10 September 19

హైదరాబాద్: మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ చిత్ర‌ల‌హ‌రి చిత్రం త‌ర్వాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో మరో చిత్రాన్ని చేస్తున్నాడు. ‘ప్ర‌తి రోజు పండ‌గే’ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స‌రికొత్త లుక్‌లో తేజూ క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన విందు అందించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

‘చిత్రలహరి’ విజయం తర్వాత సాయిధరమ్ తేజ్ పెద్ద నిర్మాణ సంస్థలతో చేతులు కల‌ప‌డం విశేషం. స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌లో కనిపించ‌నున్నాడు. తాజాగా ఈ చిత్రం ప్రీ లుక్ విడుద‌ల చేశారు.

ఇందులో ఇద్ద‌రు వ్య‌క్తులు చేతిలో చేయి క‌లిపిన‌ట్టుగా ఉంది. వేలు విడ‌వ‌ని బంధం అనే క్యాప్ష‌న్‌తో పోస్ట‌ర్‌ను రూపొందించారు. రేపు రాత్రి 8గంటలకు చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు యూనిట్ సభ్యులు తెలిపారు.