నిర్మాణ రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి పెద్దల్లుడు

6:58 am, Tue, 1 October 19

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఇప్పటికే హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు ఉన్నారు. తాజాగా చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి నిర్మాత కాబోతున్నాడు.

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత భర్త ఎల్‌వీ విష్ణు ప్రసాద్ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్‌మెంట్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలను నిర్మించాలని నిర్ణయించుకున్నారు.

విష్ణు, సుస్మిత ఇద్దరు కలిసి ఫస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా ఓ వెబ్ సిరీస్‌ను తీసి తర్వాత పెద్ద సినిమాలను తీయాలని భావిస్తున్నారు. అయితే వెబ్ సిరీస్‌కు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.

విష్ణు ప్రసాద్ చెన్నైకి చెందిన వ్యాపారవేత్త. 2006లో విష్ణు, సుస్మిత వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.