అభిమాని చిరకాలకోరిక నెరవేర్చిన మెగాస్టార్ చిరంజీవి..!

4:28 pm, Mon, 22 April 19
Chiranjeevi Latest News, Megastar Latest News, Tollywood News, Newsxpressonline

హైదరాబాద్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. గతంలో రాజకీయ రంగంలో అడుగు పెట్టాక కొద్దిగా తగ్గినా కానీ ఈ మధ్య సినిమాలు మొదలుపెట్టాక మళ్లీ దుమ్ము దులుపుతున్నారు చిరంజీవి.

ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమాని వెంకటేశ్వరరావు అనే అతను తన చిన్ననాటి నుండి చిరంజీవి సినిమాలు తీస్తూ తిరుగుతూ ఆయనను అభిమానిస్తూ ఎంతగానో ఎదిగారు.

అంతేకాకుండా 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో పార్టీ కోసం తీవ్రంగా కష్టపడి స్థానిక ప్రత్యర్థి రాజకీయ నేతల చేత తన స్వస్థలం నుండి వెలివేయబడ్డారు. దీంతో అప్పట్లో ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి గారు తన ఇంటికి పిలిపించుకొని రోజంతా ఆశ్రయమిచ్చి సర్వ మర్యాదలు చేసి కుటుంబం అందరికీ బట్టలు పెట్టి పంపించడం జరిగింది.

గత సంవత్సరం ఇదే నెలలో శ్రీ వెంకటేశ్వర రావుకు బాబు పుట్టడం జరిగింది .అతనికి మెగాస్టారే నామకరణం చేయాలి లేదంటే ఎన్ని రోజులైనా వేచి ఉంటానని అన్నాడు. ఆ విషయాన్ని శ్రీ చిరంజీవి గారు తెలుసుకొని వెంటనే కుటంబ సభ్యులు అందరిని ఇంటికి పిలిపించుకొని ఆ చిన్నారికి పవన్ శంకర్ అని నామకరణం చేసి ఆ కుటుంబంతో గంట సేపు ముచ్చటించారు.

చదవండి: బిగ్ బాస్ సీజన్ 3లో పలు మార్పులు.. హోస్ట్‌గా హీరోయిన్ అనుష్క!?