మెగా అభిమానులకి మరో పండుగలాంటి వార్త!

8:33 am, Sun, 21 April 19
Megastar-Chiranjeevi-

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా సినిమా చేస్తున్నారు. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పోరాట యోధుడు పాత్రలో నటిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా గా విశిష్టతను సంతరించుకుంది.

రామ్ చరణ్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి. మరియు అదే విధంగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార సుదీప్ విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కనిపిస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన తర్వాత సినిమా పై ఫోకస్ పెట్టారు. అంజి తర్వాత మళ్ళీ ఫిక్షన్ మూవీలో నటించిన చిరు ఈ సినిమా తర్వాత కూడా మరో భారీ సినిమానే చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.అందులోను సోసియో ఫాంటసీ చిత్రాన్ని తీసేందుకు చిరు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని మెగా కాంపౌండ్ నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాటలు.

మరొకసారి సోసియో  ఫాంటసీ సినిమా లో చిరంజీవి నటించడానికి రెడీ అవుతున్న క్రమంలో ఇది చిరంజీవి అభిమానులకి పండగలాంటి వార్త అని అంటున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందినవారు. మరొకసారి సోసియో ఫాంటసీ సినిమా లో చిరంజీవి నటించడానికి రెడీ అవుతున్న క్రమంలో ఇది చిరంజీవి అభిమానులకి పండగలాంటి వార్త అని అంటున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందినవారు.