విజయశాంతిని చూస్తుంటే గుండె కొంచెం కిందికి జారుతోంది: చిరంజీవి

8:09 am, Mon, 6 January 20

హైదరాబాద్‌: నిన్న జరిగిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి, లేడీ అమితాబ్ ప్రముఖ నటి విజయశాంతి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ విజయశాంతిపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘సండే అనకురా.. అననురా.. మండే అనకురా…ఎప్పటికీ అననురా…ఎన్నడూ నీదాన్నిరా…’’ అని అప్పట్లో మాట ఇచ్చిన విజయశాంతి 15 ఏళ్లు తనను వదిలేసి వెళ్లిపోయిందని అన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కనిపించిందన్నారు.

ఇద్దరం కలిసి 20 వరకు సినిమాలు చేశామని గుర్తు చేసుకున్న చిరంజీవి.. తాము హీరో హీరోయిన్లలా కాకుండా కుటుంబ సభ్యుల్లా ఉండేవాళ్లమని అన్నారు. 15 ఏళ్ల తర్వాత తిరిగి కెమెరా ముందుకు వచ్చినా అదే గ్లామరు కనిపిస్తోందని, ఆమెను చూస్తుంటే తన గుండె కొంచెం కిందికి జారుతోందని చిరంజీవి అనడంతో స్టేడయం స్టేడియం నవ్వులతో హోరెత్తింది.