నేను తీసిన మొదటి ఫొటో ఇదే.. ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఫొటో పోస్టు చేసిన చిరంజీవి

- Advertisement -

హైదరాబాద్: సోషల్ మీడియాలోకి ఇటీవల ప్రవేశించిన చిరంజీవి తన అభిమానులతో రెగ్యులర్ ఉంటూ అలరిస్తున్నారు. అనేక విషయాలు పంచుకుంటున్నారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి ఆయన చేసిన కృషిపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ సందర్భంగా ఈ ఉదయం ఓ కెమెరాను పోస్టు చేసిన చిరంజీవి తాను తొలిసారి ఫొటో ఈ కెమెరాతోనే తీశానని పేర్కొన్నారు.

ఈ కెమెరాతో తీసిన ఫొటోను మరికాసేపట్లో ఫొటోను పోస్టు చేస్తానని చెప్పిన చిరంజీవి కొద్దిసేపటి క్రితం ఓ ఫొటోను షేర్ చేశారు. ‘నేను తీసిన మొదటి ఫొటో… ఇందులో ఐదుగురు ఉన్నారు.

వీరిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు.. చెప్పుకోండి చూద్దాం’ అని అభిమానులకు సవాలు విసిరారు.

 

- Advertisement -