ఎంపీ మురళీమోహన్ ఇంట తీవ్ర విషాదం !

5:40 pm, Thu, 18 April 19

రాజమండ్రి: ప్రముఖ నటుడు, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ తల్లి శ్రీమతి మాగంటి వసుమతిదేవి ఈరోజు కన్నుమూశారు. ఈ ఉదయం ఆమె తమ స్వగృహంలో తుదిశ్వాస విడిచారని సమాచారం. ఆమె వయస్సు ప్రస్తుతం 100 సంవత్సరాలు.

ఆమె అంత్యక్రియలు రేపు ఉదయం జేఎన్ రోడ్ లో నిర్వహించనున్నారు. మాతృవియోగంతో బాధపడుతున్న మురళీమోహన్ ను పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పరామర్శించారు. ఇటీవలే మురళీమోహన్ తన తల్లి వసుమతీదేవి శతవసంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కృష్ణాజిల్లా గుడివాడలోని గౌరీశంకరపురంలో ఈ వేడుకలు నిర్వహించారు. వందో పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కేక్ కట్ చేయించారు మురళీమోహన్. ఈ వేడుకలకు సుమారు 100 మందికిపైగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇంతలోనే ఆమె అసువులు బాశారు.